ఆంధ్రాలో కేసీఆర్ స్వాగత బ్యాన‌ర్లుపై ఏం రాసారో చూసారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ప్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ రోడ్డు పక్కన భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేరుతో ఈ పోస్టర్లు ఏర్పాటయ్యాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట   విమానాశ్రయంకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం  తరపున రూ.5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేయనున్నారు.  అదేవిధంగా 22వ తేదీన తిరుపతిలో జరుగనున్న తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఆయనతోపాటు కేటీఆర్‌, కవిత కుటుంబ సభ్యులు, మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, పద్మరావు ఐకే రెడ్డి తదితరులు పాల్గొంటారు.

Total Views: 37744 ,

2 Comments

  1. Really KCR DYNAMIC POLITICAL HERO HE IS LEADER OF HUMAN TELANGANA PEOPLE LUCKY PERSON S

  2. KCR gaaru nijamaina Jana entha athanu nayakulake NAYAKUDU athanu entha matladathado Anthe pani chesthadu TELANGANA prajalu adhrushtavanthulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ