‘గౌతమిపుత్రశాతకర్ణి’ రివ్యూ & రేటింగ్

gspk-rrసంక్రాంతికి బరిలోకి దిగిన పందెంకోళ్లలో ఓ కోడి.. ఫలితం తేలిపోయింది. మరో పందెంకోడి హడావుడి మొదలైంది. చారిత్రక నేపథ్యం..బాలయ్య నట విశ్వరూపం.. క్రిష్ స్టామినా మీద ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న హంగామా అంతాఇంతాకాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడిని కూడా షురూ చేశారు.  ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి చారిత్రాత్మ‌క క‌థ‌తో మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా అందుకుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూ తెలుసుకోవాల్సిందే…
క‌థ:
కుంత‌ల దేశాన్ని జ‌యించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి(నంద‌మూరి బాల‌కృష్ణ‌), కోస‌ల దేశంపైకి దండెత్తడానికి సిద్ధ‌మ‌వ‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది. త‌ల్లి గౌత‌మి బాలాశ్రీ(హేమామాలిని)కి ఇచ్చిన మాట ప్ర‌కారం గ‌ణ రాజ్యాలుగా విడిపోయిన భార‌త‌దేశాన్ని ఏక దేశంగా చేసి ఒక పాల‌న‌లోకి తీసుకురావ‌డానికి న‌డుం బిగించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి,. అందులో భాగంగా సౌరాష్ట్ర రాజు నిహ‌షానుడు(క‌బీర్ బేడి)ని జ‌యించాల‌నుకుంటాడు. అయితే నిష‌శానుడు సైన్యం, బ‌ల‌మైన కోట ఉండ‌టంతో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అత‌న్ని తెలివిగా జ‌యించాలనుకుంటాడు. శాత‌క‌ర్ణి భార్య వ‌శిష్టికి యుద్ధాలంటే న‌చ్చ‌వు. ఆమె శాత‌క‌ర్ణితో విభేదిస్తూ ఉంటుంది. అప్పుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఏం చేస్తాడు? శాత‌క‌ర్ణి ఆశయం నేర‌వేరిందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీనటులు :
న‌ట‌న ప‌రంగా ఇందులో బాల‌కృష్ణ విశ్వ‌రూపం క‌నిపిస్తుంది. భావోద్వేగాలు ప‌లికించ‌డంతో పాటు, యుద్ధ స‌న్నివేశాల్లోనూ చురుగ్గా క‌దులుతూ స‌న్నివేశాల్ని ర‌క్తి క‌ట్టించారు. ఆయ‌న సంభాష‌ణ‌ల్ని ప‌లికిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది. హేమ‌మాలిని, శ్రియ న‌ట‌న చాలా బాగుంది. శాత‌క‌ర్ణి మాతృమూర్తి పాత్ర‌లో హేమ‌మాలిని ఒదిగిపోయారు. శ్రియ న‌ట‌న కొన్ని స‌న్నివేశాల్లో కంట‌త‌డి పెట్టిస్తుంది. వ‌శిష్టిదేవిగా పాత్ర‌లో లీన‌మైన విధానం ఆమెలో ఎంత మంచి న‌టి ఉందో చెప్ప‌క‌నే చెబుతుంది. మిగ‌తా న‌టీన‌టులంతా కూడా వాళ్ల వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు బాగా న‌టించారు. శివ‌రాజ్‌కుమార్ ఓ పాట‌లో మెరుస్తారు. సాంకేతికంగా ఈ సినిమాకి వంద‌కి వంద మార్కులు వేయాల్సిందే. సుదీర్ఘంగా, భారీ తారాగ‌ణం నేప‌థ్యంలో సాగే పోరాట ఘ‌ట్టాలున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు ఎంతో స‌హ‌జంగా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిజంగా జ‌రుగుతున్న ర‌ణ రంగానికి మ‌నం సాక్షులుగా ఉన్నామా అనిపిస్తుంటుంది. కొన్నిచోట్ల శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా క‌లం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల బ‌లం ప్ర‌స్ఫుటంగా కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధ స‌న్నివేశాల‌కి ధీటుగా… ప్ర‌తి మాటా ఓ తూటాలా పేలిపోతుంటుంది. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం, సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు… ఇలా వేటికమే సాటి అన్పిస్తాయి. ఇంతటి భారీద‌నంతో కూడిన చిత్రాన్ని 79 రోజుల్లో తీశారంటే చిత్ర‌బృందాన్ని మెచ్చుకోవ‌ల్సిందే.

రేటింగ్ : 3/5

Total Views: 6978 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ

నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా