గణతంత్ర వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, వివిధ బృందాల కవాతు ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. సమాచారశాఖ శకటం ప్రథమ స్థానంలో నిలువగా, అటవీశాఖ శకటం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే పర్యాటక శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కింది. అలాగే ప్రథమ ఉత్తమ కవాతుగా ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ బాలురు నిలవగా, రెండవ ఉత్తమ కవాతుగా ఏపీ స్పెషల్ పోలీస్, ఎన్సీసీ బాలికలు నిలిచారు.
70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీ, స్పీకర్, మండలి చైర్మన్, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు సైనిక అమర వీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.