సికింద్రాబాద్ కార్పొరేటర్ కి 10వేల ఫైన్?

untitled-1సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట కార్పొరేటర్‌కి 10 వేల జరిమానా విధించారు గ్రేటర్ అధికారులు. ఇటీవల ఆ వార్డు పరిశీలనకు వచ్చిన మంత్రిగారికి స్వాగతం చెప్తూ పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంత్రిగారి దృష్టిలో పడేందుకు దారిపొడవునా బ్యానర్లు ఏర్పాటు చేసిన కార్పొరేటర్‌కి ఫైన్ పడింది. విషయం మీడియాలో హైలెట్ కావడంతో మంత్రి కూడా ఆగ్రహించారు. మనం పెట్టుకున్న రూల్స్ మనమే ధిక్కరిస్తా ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. మొదట్లో ఫైన్ వెయ్యాలా వద్దా అని జీహెచ్ఎంసీ అధికారులు తటపటాయించినా చివరికి 10వేలు ఫైన్ వేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి బ్యానర్లు,  ఫ్లెక్లీల ఏర్పాటుపై నిషేధం ఉండడంతో కార్పొరేటర్‌కి చివరిలా జరిగింది. అటు, వరంగల్‌లో MP పసునూరి దయాకర్‌కి కూడా ఇలాగే జరిమానా కట్టారు. క్రికెట్ మ్యాచ్‌ల ఏర్పాటుపై బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు.

Total Views: 2410 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కాటమరాయుడు యాక్షన్ సీన్స్ లీక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్