వైసీపీలో చేరిన వైఎస్ ఆప్తుడు..!

ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ ఆప్తుడు, మాజీమంత్రి మహీధర్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో పార్టీ అధినేత జగన్ ను కలిసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ నాయకత్వాన్ని, రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్ ఆశయాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని… జగన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని కాకుండా, వ్యక్తిగత అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు.

Total Views: 57 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ