పవన్ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తున్న రహస్య వ్యక్తి అతనేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలకమైన విషయం ప్రస్తావించి అంతలోనే అభిమానుల ఒత్తిడి మేరకు ఆ ప్రకటనని తన సోషల్ మీడియా ఎకౌంటు నుంచి తొలగించారు. ఏపీ, తెలంగాణాలో కలిపి 175 స్థానాలు మా బలం ఉంటె అన్ని స్థానాల్లోనే పోటీ చేస్తాం. మా బలం ఎంత ఉంటే అంతే పోటీ చేస్తాం అని ఒక పోస్ట్ చేసారు. అయితే ఆయన గతంలో కూడా ఇలా తన బలం ఎంత ఉంటే అంతే పోటీ చేస్తా అని చెప్పాడు. అయితే ఉన్నపళంగా ఈ పోస్ట్ పెట్టేసరికి ఒక్కసారిగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. 175 స్థానాలని కచ్చితంగా ఎలా ప్రస్తావించారు. అందులో అతని దగ్గర ఏదో క్లేరిటి ఉండే ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడించింది. అంతలో ఆ పోస్ట్ తొలగించడం, అప్పటికే అది వైరల్ కావడంతో తొలగించడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయం మీద అధికార, ప్రతిపక్ష పార్టీలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఇదే విషయంలో తెలుగు దేశం పార్టీలో కూడా వాడి వేడి చర్చ సాగుతున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కి కొన్ని స్థానాలు కేటాయించి, ఆయనతో పొట్టు పెట్టుకోవడం ద్వారా మరో సారి లాభపడాలని అధినేత చంద్రబాబు ఆలోచనలో ఉంది. దీనికి తగ్గట్లు గానే పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే గంటాతో పాటు కొందరు కాపు సామాజిక వర్గం నేతలని పవన్ దగ్గరకి ఎప్పటికప్పుడు పంపిస్తూ మంతనాలు జరిపించడంతో పాటు. ఆయన పూర్తి స్థాయిలో పోటీ చేయకుండా నియంత్రించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ మీద పవన్ కి తప్పుడు అభిప్రాయం చేరకుండా ఈ సామాజిక వర్గ నేతలని చంద్రబాబు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ఇలాంటి టైంలో జనసేన పార్టీ ఎకౌంటు నుంచి అలా ప్రకటన రావడంతో చంద్రబాబు షాక్ కి గురైన మంత్రి గంటాతో పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేయించి మాట్లాడించి ఉంటాడని, అందుకే ఆ ప్రకటనని వెనక్కి తీసుకున్నాడని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మాటలకి బలం చేకూర్చే విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు ఉన్నాయి. ఆయన మీడియా ముందు పవన్ కళ్యాణ్ విషయం ప్రస్తావిస్తూ, ఆయన తెలుగు దేశం పరిపాలన మీద సానుకూలంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయన మాటలని బట్టి రహస్య రాజకీయ రాయబారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య గంటా కీలకంగా వ్యవహరించి ఉంటారని అందరు అనుకుంటున్నారు.

Total Views: 289 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..