బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ ల మ‌ద్య సీట్ల స‌ర్దుబాటు చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. టీడీపీ 30 సీట్ల కోరుతున్నప్ప‌టికీ 15 సీట్ల కోసం గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతోంది. తాము పోటి చేయ‌ద‌లిచిన సీట్లు, అబ్య‌ర్ధుల జాబితాను కాంగ్రెస్ పెద్ద‌లు అంద‌చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే మిగతా పార్టీ ల సీట్ల సర్దుబాటు తో టీడీపీ సీట్లు ముడి పడి ఉన్నాయి… టీడీపీ అడుగుతున్న సీట్లెన్ని…అభ్యర్థులు ఏవరు వాచ్ దిస్ స్టోరీ…

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితి లు క‌లిసి ప్ర‌జా కూటిమిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టికే నిర్న‌యించాయి. అందులో బాగంగా కూటిమి ఎజెండా పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అదే స‌మ‌యంలో తాము పోటి చేయ ద‌లిచిన సీట్ల‌పై ఆయా పార్టీలు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. జ‌న‌స‌మితి మాత్రం ఉద్య‌మ ఎజెండా కోసం ప‌ట్టుప‌డుతుండ‌గా, టీడీపీ బ‌లంగా ఉన్న సీట్ల జాబితాను రూపొందించి కాంగ్రెస్ ముందుంచింది. పొత్తుల్లో భాగంగా 15 అసెంబ్లీ సీట్లు కోరుతున్న తెలుగుదేశం….తమ పార్టీ చేయాలనుకుంటున్న సెగ్మెంట్లు, అభ్యర్ధుల వివరాలను కూడా కాంగ్రెస్ పెద్దలకు అంద‌చేసింది.

టిడిపి 30 స్ధానాలు కోరుతున్నప్పటికీ , 15 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. కాంగ్రెస్ కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతుంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాల అబ్య‌ర్ధుల పేర్ల‌ను కాంగ్రెస్ పెద్ద‌ల ముందుంచారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్లలంద‌రికి టికెట్లు ద‌క్కెలా జాబితా రూపొందించారు. జాబితా ఈ ర‌కంగా ఉంది.

1. దేవరకద్ర – రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
2. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
3. మహబూబ్ నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ ), మాజీ ఎమ్మెల్యే
4. రాజేంద్రనగర్ – భూపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు
5. శేర్ లింగం పల్లి -మండవ వెంకటేశ్వర రావు , మాజీ మంత్రి లేదా మొవ్వ సత్యనారాయణ
6. కూకట్ పల్లి- శ్రీనివాస రావు , కార్పేరేటర్
7. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాస్ రావు, గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షులు
8. సికింద్రాబాద్ – కూన వెంకటేష్ గౌడ్,
9.ఉప్పల్- వీరేందర్ గౌడ్
10. ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టిఎన్ టియుసి అధ్యక్షుడు
11. కోరుట్ల-ఎల్ . రమణ , టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
12. హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి ,మాజీ మంత్రి
13. ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ , మాజీ ఎమ్మెల్యే
14. పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్ రెడ్డి
15. ఆలేరు – శోభారాణి, తెలంగాణ టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు
16. కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్
17. మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త, కమ్మ సామాజిక వర్గం)
18. ఖమ్మం – నామా నాగేశ్వర రావు , మాజీ ఎంపీ
19. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్యే

ఈ సీట్ల కోసం గట్టిగా ప‌ట్టుబ‌ట్టాల‌ని టీడీపీ బావిస్తోంది. ఈ సీట్ల‌లో క‌నీసం 15 సీట్ల‌లో పోటి చేయాల‌ని బావిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 15 సీట్ల‌ను గెలిచిన టీడీపీ ఈ సారి ఖ‌చ్చితంగా గెలిచే సీట్ల‌నే తీసుకోవాల‌ని బావిస్తోంది. అందుకే 19 పేర్ల‌తో జాబితాను కాంగ్రెస్ కు అంద‌చేసింది. దీనిపై కాంగ్రెస్ నుంచి ఇప్ప‌టికి ఏలాంటి స‌మాచారం రాలేద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్ స్పంద‌న‌ను బ‌ట్టి చివ‌ర్లో ఒక‌టి రెండు చోట్ల అబ్య‌ర్ధులు మారే అవ‌కాశాలున్నాయంటున్నారు.

Total Views: 1013 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే