ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జయకేతనం!

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని టీమిండియా తరఫున కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. రెండు టెస్టులు ఓడిపోయిన భారత జట్టు మూడో టెస్టు ఐదో రోజున ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసి సిరీస్ పై ఆశలను సజీవంగా నిలుపుకొంది. ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో జరిగిన మూడో టెస్టులో భారత్ ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో ఇంగ్లాండ్ ను అదరగొట్టింది. ఇంగ్లాండ్ కు 521 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 317 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం మూట గట్టుకుంది.

విజయం అనంతరం మాట్లాడుతూ కోహ్లీ ‘జట్టుగా మేం ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇస్తున్నాం. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మేం ఇంకా కొంచెం వారి కోసం చేయాలనుకుంటున్నాం’ అని తెలిపాడు. ఈ సిరీస్ ఆసక్తికరంగా కొనసాగేందుకు మూడో టెస్టులో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాడు. ఆటలోని మూడు విభాగాలైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసిందన్నాడు. ఇది పూర్తి డ్రెస్సింగ్ రూమ్ విజయంగా అభివర్ణించాడు. రెండు వరుస ఓటములతో కంగారు పడాల్సిన విషయమేం కాదన్నాడు.

రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేయడంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. బుమ్రా 85 పరుగులకు ఐదు కీలక వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

Total Views: 211 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల