కన్నీళ్లు తెపిస్తున్న నర్సు చివరి మాటలు!

మరణశయ్యపై ఉండి తన కుటుంబ సబ్యులకు ఓ నర్సు రాసిన లేఖ కంట తడి పెట్టిస్తుంది. అంతిమ ఘడియల్లో ఎవరైనా తన ఆత్మీయులంతా తన పక్కనే ఉండాలనుకుంటారు. కానీ, కేరళకు చెందిన ఓ నర్సు మాత్రం ఇందుకు భిన్నంగా, ఓ కఠిన నిర్ణయం తీసుకుంది.కేరళలో ఇటీవల ‘నిపా’ అనే ఒక కొత్త వైరస్ జనాలను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు.వారికి సపర్యలు చేసే క్రమంలో 31 ఏళ్ల లిని నాను అనే నర్సు కూడా అదే వైరస్‌కు బలయ్యారు.

అయితే, అంతిమ ఘడియల్లో ఆమె ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు.తన వారెవరినీ తన దగ్గరకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. తన దహనసంస్కారాలు కూడా ఇంట్లో వాళ్లను చేయనీయలేదు.తనకు సోకిన నిపా వైరస్ తన వాళ్లకు సోకగూడదనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు, బహ్రెయిన్‌లో ఉన్న భర్తకు ఆమె తన చివరి క్షణాల్లో ఎంతో భావోద్వేగంతో ఓ లేఖ రాశారు.

నిఫా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న లిని(31) అనే ఓ నర్సు కూడా ఆ వైరస్‌ సోకి మరణించింది. లిని భర్త సజీష్‌ బహ్రెయిన్‌లో పనిచేస్తుంటారు. ఆమెకు ఇద్దరు పిల్లలు(ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరికి రెండేళ్లు). కోజికోడ్‌లోని పెరంబర ఆస్పత్రిలో నిఫా వైరస్ బారిన పడిన తొలి బాధితుడికి చికిత్స చేసిన బృందంలో లిని కూడా ఉంది. తాను చనిపోతున్నానని గ్రహించిన లిని.. ఐసీయూలోనే తన భర్తకు రాసిన లేఖ ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.’సాజీ.. నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. మళ్లీ నిన్ను చూస్తానన్న నమ్మకం నాకిక లేదు. నన్ను క్షమించు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు..అమితమైన ప్రేమతో..’అంటూ మరణశయ్యపై ఉన్న లిని తన భర్తకు చివరి మాటలుగా నోట్ రాసింది.

Total Views: 461 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే