జగన్ కు తలనొప్పిగా సర్వే ఫలితాలు!

ఎన్నికల ముందు పార్టీలు అంతర్గత సర్వేలు చేయడం సర్వ సాధారణం. ఆ సర్వేల ఆధారంగా అధినేతలు అడుగులు వేస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ లో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఆ సర్వే ఫలితాలు అధినేత జగన్ కు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తుంది. పార్టీ పెట్టిన ఇన్నాళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుగుబాటు కనిపిస్తుంది. అందుకు ఉదాహరణే వంగవీటి రాధా, విజ్ఞాన్ రత్తయ్యలు.

ముందుగా రాధాకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు జగన్. కానీ వాళ్ళ సర్వేల్లో సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్నందున ఆ స్థానాన్ని వారికే ఇచ్చేస్తే బాగుంటుందని, రాధాను కాపు ప్రాభల్యం ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దింపితే మంచిదని తేలిందట. దీంతో జగన్ ఒక్కసారిగా రాధాకు సెంట్రల్ టికెట్టు ఇవ్వడం కుదరదని, చేస్తే తూర్పు అసెంబ్లీ స్థానానికి లేదా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమని అల్టిమేటం జారీ చేశారు. కానీ ఇన్నాళ్లు సెంట్రల్ సీటును దృష్టిలో పెట్టుకుని చేసిన గ్రౌండ్ వర్క్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని, తనకు ఆ సీటే కావాలని రాధా పట్టుబట్టుకుని కూర్చోవడంతో విజయవాడ కేటాయింపు సమస్యాత్మకంగా మారింది.

అలాగే గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి చేసిన సర్వేల ఫలితంగా గత ఎన్నికల ముందు నుండి ఆ సీటును ఆశిస్తున్న విజ్ఞాన్ రత్తయ్య కుటుంబానికి ఆశాభంగం కలిగింది. వైఎస్ జగన్ ఆ స్థానాన్ని కాపు కమ్యూనిటీకి చెందిన కిలారు రోశయ్యకు కేటాయించాలని, రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలును నరసరావుపేటకు మార్చాలని నిర్ణయించారు. రత్తయ్య కుటుంబం, అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా మర్రిరాజశేఖర్ కు సర్వేలో అనుకూలంగా రాకపోవడంతోనే విడదల రజనీకుమారిని నియమించారంటున్నారు. ఏలూరులో ఆళ్ల నానికి ఇచ్చిందీ ఇదే ఫార్ములాతోనే. నెల్లూరు జిల్లాలో వెెంకటగిరి నియోజకవర్గంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కాదని ఆనం రామనారాయణరెడ్డికి ఇచ్చిందీ అందుకే నంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా అనేకం ఉన్నా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటున్నారు.

Total Views: 184 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా