బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రేండింగ్ టాపిక్‌ బిగ్‌బాస్‌. సీజన్‌ వన్ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో ఇటీవలే రెండో సీజన్‌ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆకట్టుకొనే వాటిలో ఒకటి బిగ్‌బాస్‌ వాయిస్‌ . అయితే ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు ఎవరు వాయిస్ ఇస్తున్నారు అన్నదే అందరి ప్రశ్న..! అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా ఒక అయన పేరు బయటకు వచ్చింది.

బిగ్‌బాస్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నది ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణ బిగ్‌బాస్‌గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు. ఇంతకి బిగ్‌బాస్‌ ఏంచేస్తారంటే.. కంటెస్టంట్లకు టాస్క్‌ ఇవ్వడం, ఆదేశాలను జారీచేయడం, బిగ్‌బాస్‌ నియమనిబంధలను తెలియచెప్పడం వంటి పనులు చేస్తారు.

Total Views: 1777 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు