అబ్బాయికి 13 .. అమ్మాయికి 23..!

కర్నూలు జిల్లా లో విచిత్ర బాల్య వివాహం జరిగింది. అయితే ఈ బాల్య వివాహం పై కేసు నమోదు చేయడానికి సతమతమవుతున్నారు అధికారులు. ఎందుకంటే పెళ్లి కొడుకు వయస్సు 13 ఏళ్ళయితే..పెళ్లి కూతురి ఏజ్ సుమారు 23 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ దంపతుల మేటర్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే, తండ్రి మద్యానికి బానిస కావడం, తల్లికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడడంతో తనకున్న ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఏమవుతుందో అనే బాధతో ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడి పెళ్లి చూసి చనిపోవాలని అనుకున్న తల్లి, వెనువెంటనే బంధువులకు చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం నిర్ణయించింది.అయితే ఇందులో వింతయిన విషయం ఏమిటంటే ఆ పెళ్లికుమారుడి వయసు కేవలం 13 సంవత్సరాలు కాగా పెళ్లికుమార్తె వయసు 23 సంవత్సరాలు కావడం. వీరి వివాహానికి కౌతాళం మండలంలోని ఒక గ్రామం వేదిక అయింది. అయితే ఈ వింత వివాహానికి హాజరయిన కొందరు ఇరువైపులా పెద్దలను తిట్టిపోశారు. ఇది ఒక అవగాహనా రాహిత్యంతో చేస్తున్న వివాహమని, పెద్దలు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు పిల్లలను బలిచేస్తున్నారని నిందిస్తున్నారు.

Total Views: 144 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆయేషా మీరా కేసు : హైకోర్టు కీలక నిర్ణయం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని