‘ధృవ’ మూవీ రివ్యూ

druvaబ్రూస్ లీ సినిమాతో మెగా అభిమానులను నిరాశపరిచిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రీమేక్ గా తెరకెక్కిన ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో భారీ రికార్డ్ ల మీద కన్నేసిన చరణ్, అందుకు తగ్గట్టుగా లుక్, బాడీలాంగ్వేజ్ విషయంలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. మరి చరణ్ ఈ ప్రయత్నంలో సక్సెస్ సాధించాడా..? ధృవ ఆశించినట్టుగా రికార్డ్ లను తిరగరాస్తుందా..?
కథ :
నా శ‌త్రువే నా కెపాసిటీ గురించి తెలియ‌జేస్తాడ‌నే ఆలోచ‌న‌తో ఉండే ధృవ (రాంచ‌ర‌ణ్‌) ఐపియ‌స్ ఆఫీస‌ర్‌గా ట్ర‌యినింగ్ తీసుకునే స‌మ‌యం నుంచి త‌న చుట్టూ జ‌రుగుతున్న సోసైటీలో అన్యాయాల‌పై త‌న స్నేహితుల స‌హ‌కారంతో తిర‌గ‌బ‌డుతూ ఉంటాడు. ఇషిక‌(ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ధృవ‌ను ప్రేమిస్తుంది. అత‌ని ప్రేమ‌ను పొంద‌డానికి అత‌న్ని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే నేరాలు చేసేవారు అరెస్ట‌యినప్ప‌టికీ శిక్ష ప‌డ‌కుండా త‌ప్పించుకు తిరుగుతుంటారు. ఈ విష‌యంపై ధృవ ఆలోచించి పోస్టింగ్‌కు వెళ్లేలోపు సిటీలో జ‌రిగే నేరాల‌కు కార‌ణ‌మైన వ్య‌క్తుల వివ‌రాల‌ను సేక‌రించి అందులో ముగ్గురుని టార్గెట్ చేస్తాడు. అయితే ఈ ముగ్గురు వ్య‌క్తుల‌ను సిద్ధార్థ్ అభిమ‌న్యు(అర‌వింద స్వామి) కంట్రోల్ చేస్తుంటాడు. దాంతో ధృవ సిద్ధార్థ్‌ను త‌న శ‌త్రువుగా టార్గెట్ పెట్టుకుంటాడు. సిద్ధార్థ్ షుగ‌ర్‌కు ఓ మెడిసిన్‌ను కనిపెట్టి, దాని పెటెంట్ హ‌క్కుల కోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంజెలీనా జ‌న‌రిక్ మెడిసిన్‌ను ఇండియాకు తీసుకు రావాల‌నుకుంటుంది. జ‌న‌రిక్ మెడిసిన్ వ‌స్తే త‌మ మెడిక‌ల్ వ్యాపారాలు దెబ్బ‌తింటాయ‌ని భావించిన సిద్ధార్థ్ ఎంజెలీనాను చంపే ప్ర‌య‌త్నంలో ధృవ అడ్డుప‌డ‌తాడు. అప్పుడు ధృవ గురించి తెలుసుకున్న సిద్ధార్థ్.. ధృవ‌ను టార్గెట్ చేస్తాడు. ధృవ‌కు తెలియ‌కుండా అత‌ని శ‌రీరంలో ఓ బ‌గ్ పెట్టి ధృవ త‌న‌పై వేస్తున్న ప్లాన్స్‌ను నాశనం చేస్తుంటాడు. అప్పుడు ధృవ ఏం చేశాడు? సిద్ధార్ధ్ చేసిన మోసాన్ని ధృవ ఎలా తిప్పికొడ‌తాడు? సిద్ధార్థ్ చేసే అన్యాయాల‌కు ధృవ ఎలా చెక్ పెడ‌తాడ‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :
ఈ సినిమా కోసం తన లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న రామ్చరణ్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన గత సినిమాలతో పోలీస్తే నటుడిగాను ఈ సినిమాతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తెలివైన శత్రువుతో పోరాడే సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. విలన్గా అరవింద్ స్వామి సూపర్బ్. ఎక్కడ అతి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు. హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రాతకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా రకుల్ గ్లామర్ షో సినిమాకు మరో ఎసెట్. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, విద్యుల్లేక లు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
మరో భాషలో ఘనవిజయం సాధించిన సినిమాను రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. ప్రతీ విషయంలోనూ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తారు. అయితే ఆ రిస్క్ ను తలకెత్తుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి సక్సెస్ సాధించాడు.అదే కథను మరింత రేసీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు సాంగ్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసిన సూరి, థియేటర్లో ఉన్నంత సేపు ఇది రీమేక్ సినిమా అన్న విషయం మరిచిపోయేలా చేశాడు. హిప్ హప్ తమిళ అందించిన పాటలు వినటానికి సోసోగా ఉన్న విజువల్ గా మాత్రం అలరిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. పి ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో కెమరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్: 3.25/5

Hero Ramcharan latest movie Dhruva. The movie is a remake version of Tamil blockbuster movie Thani Oruvan and it is an action thriller movie directed by Surender Reddy and produced by Allu Aravind and N.V. Prasad under his banner Geetha Arts. The movie released on Friday.

Dhruva is an action thriller movie, which deals with the story of a police officer, who is hell-bent on arresting a rich and sly criminal. Surender Reddy has made some changes in his adaptation to suit the taste of the local audience.

Dhruva deals with routine story, but the intelligent screenplay makes it an interesting watch. The movie starts on a slow note, but the narration turns intense and fast-paced towards the interval. The second half of the film has a fast-paced narration and it is high on action quotient. The climax is good.

Ram Charan has a delivered good performance and he impresses the viewers with his macho looks and dare-devil stunts. Arvind Swamy has played the negative role that he essayed in the original and he has done justice to it. His performance is one of the highlights of the film. Rakul Preet Singh has done a good job and her glamour and chemistry with Cherry are highlights. Navdeep, Nasser, Krishna Murali Posani and Sayaji Shinde are also big assets of the film.

Allu Aravind, who has produced Dhruva under his banner Geetha Arts, has made sure that the movie has rich production values. Hiphop Tamizha’s songs and background score, PS Vinod’s picturisation, exotic locales, brilliant action scenes, Vema Reddy’s punch dialogues, Nagendra’s art direction, Naveen Nooli’s editing and amazing dance choreography are the attractions on the technical front.

Total Views: 3201 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ

నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా