తెలంగాణ రాజకీయాల్లో ఉహిచని పరిణామం!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్‌ తగిలింది. ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ వర్గల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువాతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

Damodara Raja Narasimha Wife Padmini

అనంతరం మురళీధర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరార’ని తెలిపారు.

Total Views: 123 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే