అమ్మాయిల ఫొటోలే పెట్టుబడిగా కోట్లు మోసం!

ఆన్ లైన్ లో డేటింగ్ వెబ్ సైట్లు క్రియేట్ చేసి యువకులకు అమ్మాయిల నకిలీ ఫోటోలను ఎరగా వేసి లక్షల రూపాయలను దండుకుంటున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి పంపారు… హైదరాబాద్ గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ పూర్తి వివరాలు వెల్లడించారు… పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రదాన సూత్రదారి దేబశిష్ ముఖర్జీ దేశ వ్యాప్తంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి నాలుగు వందల మంది టెలి కాలర్లతో నిత్యం పలువురు యువకులకు ఫోన్లు చేస్తు, లాకెంటో వెబ్ సైట్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలు పంపి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందాన్నారు… నగరానికి చెందిన ఓ హ్యాపారవేత్త ఈ విధంగా 15 లక్షల వరకు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా… దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ డేటింగ్ రాకెట్ గుట్టు రట్టయిందని పేర్కొన్నారు… ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికి మెంబర్ షిప్ ఇస్తామని, లైఫ్ ట్యాక్స్, జియస్టీ అని నమ్మబలికి డబ్బులు కాజేస్తున్నారని సీపీ తెలిపారు.. గత రెండు సంవత్సరాలు గా డేటింగ్ పేరుతో వందలాది మందిని మోసం చేసి కోట్లు సంపాదించినారని అన్నారు..

లవ్ పేరుతో కేటుగాళ్ల చేతిలో 150 మందికి పైగా మోసపోయిన బాధితులు ఉన్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. రూ. 10 వేల నుంచి రూ. 15 లక్షల వరకు మోసపోయిన బాధితులున్నారన్నారు. ఓ ముఠా లవ్ పేరుతో పలు వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసిందని, హిరోయిన్ ఫొటోలు పెట్టి మోసాలకు పాల్పడిందని ఆయన అన్నారు. రూ. 15 లక్షలు మోసపోయిన బాధితుడి ఫిర్యాదుతో డొంక కదిలిందని సజ్జనార్‌ పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా అనేక భాషలు మాట్లాడే యువతులతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా స్థానిక ఫోన్‌ నంబర్లతో మాట్లాడి వ్యవహారం నడిపించేవారని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి 37 మంది కాల్‌సెంటర్‌ ఉద్యోగులకు నోటీస్‌లు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్కో కాల్‌సెంటర్‌ నుంచి రోజుకు లక్ష సంపాదన ఉండేదని సజ్జనార్‌ తెలిపారు.

Total Views: 446 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్