బిగ్‌బాస్‌: విన్నర్‌ శివబాలాజీ!!

తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్‌ షో తొలి సీజన్‌ ఘనంగా ముగిసింది.బిగ్‌బాస్ సీజన్-1 విన్నర్ ఎవరూ? అన్న ఉత్కంఠకు ఆదివారం తెర పడింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది.విన్నర్‌గా శివ బాలాజీ నిలిచినట్లు షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఈ సీజన్‌లో ఆదర్శ్‌, అర్చన, హరితేజ, శివ బాలాజీ, ముమైత్‌ ఖాన్‌, ప్రిన్స్‌, సమీర్‌, సంపూర్ణేష్‌ బాబు, కత్తి కార్తీక, ధన్‌రాజ్‌, మధుప్రియ, కల్పన, మహేష్‌ కత్తిలు పాల్గొన్నారు. షో నాలుగు వారాలు పూర్తైన తర్వాత బంతిపూల జానకి ఫేం దీక్షా పంత్‌, హీరో నవదీప్‌లు వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టంట్లలో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. గత వారం అక్షరాలా పదకొండు కోట్లకు పై చిలుకు మంది ఆడియన్స్‌ తమ అభిమాన సెలబ్రిటీని గెలిపించేందుకు ఓటింగ్‌లో పాల్గొన్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో శివ బాలాజీ బిగ్‌బాస్ సీజన్-1 టైటిల్‌తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. విన్నర్‌ను ప్రకటించిన వెంటనే శివ బాలాజీ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం విజేతకు ట్రోఫీ, క్యాష్‌ ప్రైజ్‌లను వ్యాఖ్యాత ఎన్టీఆర్‌ అందజేశారు.చివరి రోజు ఈ షో దాదాపు 5.30 గంటలకు పైగా ప్రసారం అయింది. అంతేకాదు చివరి రోజు ఎన్టీఆర్‌తో కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై పాటలు, డాన్స్‌తో అలరించారు. బిగ్‌బాస్‌లోని కంటెస్టంట్లందరికి ఫన్నీఅవార్డులను కూడా ప్రకటించారు. గెలుపొందిన శివబాలాజీ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన తీపి గుర్తులను ఏ నాటికీ మర్చిపోలేనని అన్నారు. తను గెలుపొందాలని ఫోన్ల ద్వారా ఓటింగ్ చేసిన వాళ్లందరకీ కృతజ్ఞతలు తెలిపారు.

కొసమెరుపుగా బిగ్‌బాస్‌లోని కంటెస్టంట్లందరికి ఫన్నీఅవార్డులను కూడా ప్రకటించారు.

ఫన్నీ అవార్డ్స్:
ఉచిత సలహా అవార్డు (మహేష్ కత్తి)
అయోమయం అవార్డు (సంపూర్ణేష్ బాబు)
గ్రైన్డర్ అవార్డ్ (దీక్ష)
రోమియో అవార్డు (ప్రిన్స్)
బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు (ధనరాజ్)
గురకరాయుడు అవార్డు (సమీర్)
ఫిటింగ్ మాస్టర్ అవార్డు (కత్తి కార్తీక)
గుండెల్లో గోదారి అవార్డు (మధుప్రియ)

Total Views: 3350 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా