ముందే వస్తున్నాయి.. జాగ్రత్త : కేసీఆర్

ఎలక్షన్స్ వస్తున్నాయంటే నాయకుల్లో ఎంత ఆందోళన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోతారు. ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలు కూడా రహస్య మీటింగ్ లతో చాలా చర్చలు సాగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది చివరిలోగానే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేలా ఉన్నాయని కేంద్ర నుంచి సమాచారం అందుతోంది. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగవచ్చని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఈ విషయం పై మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటీవల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్ గా నాయకులతో చర్చలు జరిపి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని 2018-19 బడ్జెట్ తరువాత ప్రతి ఒక్కరు నియోజక వర్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతే కాకుండా నాయకుల్లో కొత్త బలాన్ని కూడా కేసీఆర్ నింపారు. సర్వేల ప్రకారం దాదాపు అన్ని స్థానాల్లో టీఆరెస్ చాలా బలంగా ఉందని తెలుపుతూ.. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనమే గెలవగలమని భరోసా ఇచ్చారు. ఇక కొన్ని జిల్లాల్లో ఇంకా పార్టీ బలపడాలని తెలియజేస్తూ..అందుకు తగ్గ నాయకులను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉందని కేసీఆర్ తెలిపారు.

Total Views: 1035 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బాబుకు అవార్డ్ ఇచ్చినవాడికి బుద్దుందా?

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ..