పద్యాలు.. పాటలతో కెసిఆర్ అద్భుత ప్రసంగం!

హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి తరలివచ్చిన తెలుగు ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ… ‘ఎంత గొప్ప వ్యక్తికైనా అమ్మ ఒడి మొదటి బడి’ అన్నారు. తెలుగు భాషా వికాసం, పరిరక్షణకు అందరం సంకల్పించాలి. మా చిన్నతనంలో గురువులు శతకపద్యాల ద్వారా నీతి బోధించేవాళ్లు. మా గురువు మృత్యుంజయశర్మ ప్రోత్సాహంతో నాలో సాహిత్య పిపాస పెరిగింది. రాయిలాంటి నన్ను ఆయన సానబెట్టారు. సాహిత్య కుసుమాలు వికసించిన ప్రాంతం సిద్దిపేట‌. చెరువు గట్టుపై కూర్చుని తొమ్మిదో తరగతిలోనే నేను తెలుగు పద్యాలు రాశా. ఆ గొప్పతనం నాది కాదు మా గురువులది’ అంటూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. చిన్నప్పుడు చదువుకున్న అనేక పద్యాలను సభలో వివరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.

Total Views: 556 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ కి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్ ఇచ్చినట్టే?

గుంటూరు రాజకీయాల్లో అగ్రనేత, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ.