పవన్ యాక్షన్ – బాబు రియాక్షన్!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ టిడిపిలో సునామీ సృష్టిస్తోంది. పవన్ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నేతలు ఆగ్రహంగా ఉన్నారు. నారా లోకేష్..సీఎం చంద్రబాబు నాయుడు..ఇతర అంశాలపై పవన్ గుంటూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పవన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపీలు, మంత్రులతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన తనయుడు నారా లోకేష్ పై విమర్శలు..ఆరోపణలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అన్నీ వదులకుని ప్రజా సేవ చేసేందుకు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని, సంపాదించేందుకు లోకేష్ కు చాలా వ్యాపారులున్నాయన్నారు. అన్యాయం చేసిన వారిని అనడానికి పవన్ కు నోరు రాలేదని కేవలం టిడిపిని తిట్టడానికే గుంటూరులో పవన్ సభ పెట్టినట్లుగా ఉందని తెలిపారు. పవన్ ను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఎవరో గ్రహించాలని, పవన్ ఆరోపణలకు ప్రతి సమాధానమే ఇవ్వాలి కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని బాబు సూచించారు. కేంద్రాన్ని ఒక్కమాట వినకుండా పోరాడుతుంటే ఇంకా మాటలు ఎందుకు అంటారని బాబు ప్రశ్నించారు.

 

Total Views: 176 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే