19..24..29 ..ఇదేమి లెక్క బాబు..!

2019 ఎన్నికల్లోనూ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… 2024, 2029లోనూ ఇదే రిపీట్‌ అవుతుందన్నారాయన. కలెక్టర్ల సదస్సు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం… ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో త‌మ నేత‌లు, కార్యక‌ర్తలు 20 ల‌క్షల ఇళ్లకు వెళ్లారని… ప్రజలకు మరింత దగ్గరవుతున్నామన్నారు.

ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్తే కూడా అడ్డుపడుతున్నారు… వీళ్లు ఏం నేతలంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు చంద్రబాబు… మంచి పనులుచేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నానని… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళతామన్నారు చంద్రబాబు… సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రాయ‌ల‌సీమ మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని చంద్రబాబు చెప్పారు. రాయ‌ల‌సీమ‌లోనూ ఏక‌ప‌క్ష ఫ‌లితాలు వ‌స్తున్నాయని చెప్పారు.

Total Views: 1447 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి