చంద్రబాబు కు తమ్ముళ్ల రూపంలో కొత్త తలనొప్పి!

గత కొంత కాలంగా ఆంద్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయని పలు మీడియాలలో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. చాలా మంది నాయకులు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే తరహాలో మరికొంత మంది సీనియర్ లీడర్ల మధ్య విబేధాలు తలెత్తినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదో ఒక సందర్భంలో తెలుగు తమ్ముళ్లు మధ్య విబేధాలు రావడం కామన్ అయిపోయింది. దీంతో చంద్రబాబుకి కూడా తలనొప్పి తీవ్రంగా పెరిగిపోయేది.  ఇక అసలు విషయానికి వస్తే.. కొంత మంది తెలుగు తమ్ముళ్లు పార్టీ కి గుడ్ బాయ్ చెప్పాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్పెషల్ ప్యాకేజ్ ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధిష్టానం పూర్తిగా విఫలం అయ్యిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గల్లో జనాలు పూర్తి వ్యతిరేకంగా ఉండడంతో వచ్చే ఎలక్షన్ లో గెలవడం కష్టమని టీడీపీకి వీడ్కోలు పలకాలని అనుకుంటున్నారట. విషయం చంద్రబాబు వరకు రావడంతో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్లీ అందరిని తన వైపు తిప్పుకునేందుకు సన్నహకలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Total Views: 126 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ