డీఎల్ కోసం డీల్ సెట్ చేసిన చంద్రబాబు!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో చంద్రబాబు వడి వడిగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడంతో ఎప్పటి నుంచో పార్టీలోకి తీసుకోవానుకుంటున్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డికి మార్గం సుగమం చేసినట్టే అని చెప్పాలి.  కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జిగా సుధాకర్ యాదవ్ కొనసాగుతున్నారు.తాజాగా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎల్ రవీంద్ర చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఎల్ ను పార్టీలోకి తీసుకుంటే కేవలం మైదుకూరు నియోజకవర్గమే కాకుండా కడప జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే పుట్టాను వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పించడానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పుట్టాను ఈమేరకు ఒప్పించి ఆ పదవి ఖారారు చేసినట్లు చెబుతున్నాయి.ఇక డీఎల్ చేరిక ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే డీఎల్ చేరతారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Total Views: 1839 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ కి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్ ఇచ్చినట్టే?

గుంటూరు రాజకీయాల్లో అగ్రనేత, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ.