వైస్ వీరవిధేయుడు దారెటు..?

చిత్తూరులో సీకే బాబు గురించి తెలియనివారుండరు.. సంచలన రాజకీయ నేతగా ఆయనకు పేరుంది.. తిరుగులేని నాయకుడిగా ఎదిగిన సీకే బాబు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.. కౌన్సిలర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన సీకే బాబు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు.. 2014 వరకు చిత్తూరు కార్పొరేషన్‌లో ఆయన మాటకు ఎదురుండేది కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారంటే అందుకు కారణం కార్పొరేషన్‌పై ఆయన సాధించిన పట్టే!

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సీకే బాబు గత సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు.. అయితే ఆ పార్టీలో కొందరు ఆయనపై దుష్ప్రచారం చేసి ఆయన టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు అని వైసీపి అధినేతతో తప్పుడు సంకేతాలు పంపారు ,కొన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ బీజేపీలో చేరారు.. ఇప్పుడు ఆయనను అమితంగా అభిమానించే ముస్లింలు బీజేపీ నుంచి బయటకు రావాలంటూ కోరికలాంటి డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా మద్దతిచ్చి గెలిపించుకుంటాం .. బీజేపీలో ఉంటే మాత్రం వద్దు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొంత జిల్లా వాసి అయిన సీయం చంద్రబాబు ని గౌరవ ప్రదంగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళిన సీకే బాబు పై వైసీపి లోని కొందరు దుష్ప్రచారం చేసీ ఆ పార్టీలో ప్రాధాన్యతను కోల్పోయేలా చేశారు .. తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ద్వారా సీకే బాబు దంపతులు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలలో హుషారుగా పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేవారు.

బీజేపీ అంటే ప్రజలు మండిపడుతున్న వాస్తవాన్ని గ్రహించి ఆ పార్టీపై మునుపటి శ్రద్ధాసక్తులను కనబర్చడం లేదు.. ఇప్పుడు బీజేపీలో ఉంటే ఆయన అభిమానులు పార్టీని వదిలేయమని పోరు పెడుతున్నారు.. మీకున్న పేరుప్రతిష్టలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తారేమోగానీ.. బీజేపీ నుంచి పోటీ వద్దే వద్దు అని. స్వతంత్రంగా పోటీచేస్తే తామంతా మద్దతిస్తామని హామీ ఇస్తున్నారు ముస్లిం అభిమానులు. పార్టీ ని వీడటంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. సీకే బాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు.. తనకు పార్టీ అంటూ ఏదీ లేదని.. తనది ప్రజల పార్టీ అని చెప్పుకొస్తున్నారు. తనకు వ్యక్తిగత స్వార్థాలు లేవని.. ప్రజలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని అంటున్నారు. ప్రజల కోరిక మేరకు త్వరలోనే ఓ సముచిత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు..ఇందులో భాగంగానే సీకే బాబు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ లో వుంటానని ప్రకటించారు ఆయన యెక్క ప్రభావం చిత్తూరు తో పాటు గా పూతలపట్టు, గంగాధర నెల్లూరు మరియు పలమనేరు నియోజకవర్గాలలో కూడా చూపిస్తుందన్న భావనతో పలుపార్టీల నాయకులు ఆయనతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం చూద్దాం మరి సీకే బాబు పయనం ఎటువైపన్నది వేచి చూడాలి…

Total Views: 222 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే