కూకట్‌పల్లికి సినీ గ్లామర్!

తీవ్ర ఉత్కంఠ రేపిన కూకట్‌పల్లి సీటును హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని చేజిక్కుంచుకోవడంతో ఒక్కసారిగా కూకట్‌పల్లి పాలిటిక్స్ వేడెక్కాయి. కూకట్‌పల్లి ప్రచారానికి సినీ గ్లామర్ తోడుకానుంది. అటు బాబాయ్ బాలయ్య, ఇటు సోదరులు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ ప్రచారంలో పాల్గొననున్నారు.సుహాసిని, కుటుంబ సభ్యులు, బాలకృష్ణలతో కలిసి శనివారం ఉదయం నివాళులర్పించారు.అక్కడ నుంచి మహాప్రస్థానంలోని తన తండ్రి హరికృష్ణ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడే నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ  తన అన్న కూతురు సుహాసినిని ఆశీర్వదించారు.. తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. బహిరంగ సభల్లో, రోడ్‌షోలలో పాల్గొంటానన్నారు. ఈ నెల 26 నుంచి ప్రచారంలో పాల్గొంటానని బాలయ్య పేర్కొన్నారు.మహాకూటమి తరఫున ఇటు బాలయ్య, అటు కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ విజయశాంతి, జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు ప్రచారం చేయడం ద్వారా కూకట్‌పల్లి సీటును భారీ మెజారిటీతో గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు.సుహాసిని విజయంలో సెటిలర్లు కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.

Total Views: 46 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా