‘ ఖైదీ నెంబర్‌ 150 ’ రివ్యూ & రేటింగ్

khaidhi-no150మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత తమ అభిమాన నటుడు వెండితెరపై హీరోగా కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన నటన, పంచ్ డైలాగ్స్, డ్యాన్సు లు, పాటలతో ఖైదీ నెం.150 సినిమాతో వాల్డ్ వైడ్ గా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన ఫ్యాన్స్ తో బాటు ఆడియెన్స్ నంతటినీ ఎలా కట్టి పడేశాడో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే…

కథ :
కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో ల‌క్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ ల‌క్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.

మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.

శంక‌ర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి పూర్వాపరాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.

నటీనటులు :
తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్.

సినిమాకు ఫస్టాప్ హైలెట్ అని ప్రేక్షకులు నొక్కి చెబుతున్నారు. ఫ్యాన్స్‌కు మాత్రం పండగ లాంటి సినిమా అని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఖైదీ నెం.150 సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు సంబరాలు చేస్తున్నారు. చిరు ఖైదీ నెం.150 సినిమా సంక్రాంతికి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

రేటింగ్ : 3.75/5

(Satish K.S.R.K)

Total Views: 10847 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ

నేటితరం యువ కథానాయకుల్లో వరుణ్‌తేజ్‌ సినిమాల ఎంపిక చాలా భిన్నంగా