పెళ్లిపీటలెక్కనున్న ద్రోణవల్లి హారిక

ప్రముఖ భారత చెస్ క్రీడాకారిణి, ఏపీ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కార్తీక్ చంద్ర అనే సివిల్ ఇంజనీర్‌తో హారికకు పెళ్లి నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. వీరి నిశ్చితార్థం ఈ నెల 18న హైదరాబాద్‌లో జరగనుండగా.. ఆగష్టు 19న వివాహం జరగనుంది.

అయితే 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ను గెలిచిన హారిక, 2001లో గ్రాండ్ మాస్టర్ హోదాను సంపాదించుకుంది. అలాగే కామన్వెల్త్, ఆసియా ఛాంపియన్‌గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 సంవత్సరాలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను సాధించింది. కాగా ఈ ఏడాది మార్చిలో ఏపీకి చెందిన చెస్ క్రీడాకారుడు హరికృష్ణ సెర్బియన్‌కు చెందిన తన ప్రియురాలు నదేజ్డా స్నోజనోవిక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

 

Total Views: 559 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఇందుకే ద్రవిడ్ అంటే అభిమానం! : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ క్రికెటర్ ద్రవిడ్