ఆంధ్రాలో నారా! .. తెలంగాణాలో నందమూరి?

తెలంగాణ ఎన్నికల బరిలో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్.. హరికృష్ణ మరణం తరవాత ఆ కుటుంభం నుంచి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్టు సమాచారం.కూకట్ పల్లి నుంచి కానీ శేరిలింగంపల్లి నుంచి కానీ కళ్యాణ్ రామ్ పోటీ.  తెలుగుదేశం అనుకూల మీడియా లో ఈరోజు ప్రముఖ హెడ్ లైన్ ఇదే. అయితే ఈ వార్తను రెండు కోణాల్లో చూడొచ్చు అనిపిస్తుంది. ఒకటి నందమూరి వారి కోణం.. మరొకటి నారా వారి కోణం. నారా వారి కోణం లో చూస్తే … నాడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతానికి చంద్రబాబు తన శక్తులన్నీ ధారపోసి పనిచేసారు అన్నది సత్యం. అందులో భాగంగానే తెలంగాణ లో బలహీనంగా ఉన్న టీడీపీకి కొత్త ఉత్యాహాన్ని తీసుకురావాలి అంటే కళ్యాణ్ రామ్ ని బరిలోకి దింపటం తప్పే కాదు. అంతే కాదు కళ్యాణ్ రామ్ పోటీ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేయక తప్పదు. సో తెలంగాణాలో టీడీపీకి ఊహించని మైలేజ్ వస్తుంది అన్నది కూడా వీరి ఆలోచనగా తెలుస్తుంది.

ఇక నందమూరి వారి కోణం లో చూస్తే అభిమానులకు శుభవార్తే అవుతుంది. కాకపోతే కొంత మంది అభిమానులు ఈ అంశాన్ని వేరే కోణం లో చూస్తున్నారు. ఆంధ్ర లో నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేయటం కోసమే హరికృష్ణ కుటుంబాన్ని తెలంగాణ కి పరిమితం చేస్తున్నారు అన్నది వారి వాదన. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయలేదు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తాడు అన్నది చెప్పలేని పరిస్థితి. అందుకే కళ్యాణ్ రామ్ కి సీట్ ఇస్తే ఎన్టీఆర్ తప్పక ప్రచారం చేయాలి. అందుకోసమే కళ్యాణ్ రామ్ కి సీట్ ఇస్తున్నారు అని కొంత మంది అభిమానులు వాదన. అయితే కళ్యాణ్ రామ్ ప్రమేయం లేకుండానే తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయని .. కళ్యాణ్ రామ్ అసలు రాజకీయాల్లో కి రారు అని ఆయనకు ఆ ఉద్దేశమే లేదని..  వారికి అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఇందులో ఏది నిజమో లో గుట్టు ‘ఎన్టీఆర్ భవన్’కెరుక.

Total Views: 140 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే