హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ పై సంచలన కదనం

heritageఎవరి బినామీ ఈయన ? ??? మధ్యలో ఈ విధేశీ యాత్రలు ఎందుకో…???

బినామీ కంపెనీలు, నల్లధనం కాపాడుకునే కంపెనీల వివరాలను లీక్ చేసిన పనామా పత్రాల తాజా జాబితాలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ డైరెక్టర్ పేరు వెలుగు చూడడం సంచలనంగా ఉంది. డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ వివరాలను సంపాదించి ప్రముఖంగా ప్రచురించింది. హెరిటేజ్ పుడ్స్ డైరెక్టర్ మొటపర్తి శివరామ ప్రసాద్ కు ఎమ్.పి హోల్డింగ్స్ అసోసియేట్స్,బాలివార్డ్ లిమిటెడ్, బిట్ కెమి వెంచర్స్ కంపెనీలతో సంబందం ఉన్నట్లు ఆ పనామా పత్రాలలో వెల్లడైందని చెబుతున్నారు. మూడుసార్లు ప్రసాద్ పేరు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. బ్రిటన్ వర్జీన్ ఐలాండ్స్ , పనామా, ఈక్విడార్ లలో మూడు కంపెనీలు ఉన్నాయి.ఇవి పన్నులు ఎగవేసినట్లు అబియోగాలు వచ్చాయి. నల్లధనం కంపెనీలుగా పేరొంది ,పనామా పత్రాలలో పేరు ఉన్న వ్యక్తి హెరిటేజ్ కంపెనీలో కూడా డైరెక్టర్ గా ఉన్నారన్న వార్త సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చికాకు కలిగించవచ్చు.వర ప్రసాద్ కు సంబందించి పూర్తి విచారణ జరిపితే అనేక విషయాలు బయటకు రావచ్చని మీడియాలో వ్యాఖ్యానం వస్తోంది.అయతే తాను ముప్పై ఏళ్లుగా విదేశాలలో ఉంటున్నానని, పలు దేశాలలో తనకు కంపెనీలు ఉన్నాయని వరప్రసాద్ చెప్పారు. హెరిటేజ్ పుడ్స్ లో తను ఇండిపెండెంట్ డైరెక్టర్ నని ఆయన చెప్పారు.సిమెంటు రంగంలో తనకు కంపెనీలు ఉన్నాయని ఆయన తెలిపారు.తనకు వర్జిన్ ఐలాండ్స్ లో కూడా కంపెనీలు ఉన్నాయని ఆయన చెప్పారు.తనకు పనామా వ్యవహారం తెలియదని, దానిని తన సిబ్బంది లాయర్లు చూసుకుంటారని వరప్రసాద్ తెలిపారు.తన వ్యాపార సంస్థలన్ని చట్టబద్దంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.అయితే పనామా ప్రకటించిన జాబితా మాత్రం పన్ను ఎగవేసే కంపెనీలతో సంబందం ఉన్నట్లు చెబుతోందని ఆ కదనం వివరించింది. కాగా వరప్రసాద్ కుమారుడు సునీల్ బిట్ కెమి వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా పత్రాలు తెలిపాయి.ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా విదేశీయాత్రలో ఉన్నారు. ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

Total Views: 412 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే