చంద్రబాబు భోజనం మెనూ ఇదే..

cbnరాజకీయల్లో ఉన్నప్పుడు, ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసమే రుచికోసం తినడం ఎప్పుడో మానేశానని చెప్పారు..కాగా నేడు నెల్లూరులోని చెన్నూరు లో జన్మభూమి – మావూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు తన ఆహార నియమావళిని ప్రజలకు వివరించారు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉండలేమని ఆయన ఆన్నారు.

తాను తీసుకునే ఆహారం చెన్నూరులో కూడా దొరుకుందని చంద్రబాబు అన్నారు. తాను తక్కువ ఖర్చుతో మంచి ఆహారాన్ని తీసుకుంటానని ప్రజలకు వివరించారు. తాను ప్రతిరోజు ఉదయం రాగి, సజ్జ , జొన్న ఇలా రోజుకోరకం ఉడికించుకుని తింటానని అన్నారు. ఆ తరువాత రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లు ( పచ్చ సోన తీసేసి) తీసుకుంటానని అన్నారు.మధ్యాహ్న భోజనానికి ముంద ఏదో ఒక పండు తీసుకుంటానకి అన్నారు.రెండు రకాల కూరగాయలు, పెరుగుతో భోజనం చేస్తానని ఆయన అన్నారు. చేపల్ని తింటే మంచిందని చెప్పడంతో ఈమధ్య నుంచి వాటిని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాత్రి భోజనం తరువాత పడుకోబోయో ముందు గ్లాసు పాలు తీసుకుంటానని అన్నారు. తాను ప్రతి రోజు తీసుకునే ఆహరం ఇదే అని అన్నారు. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదని చంద్రబాబు అన్నారు.ఉదయం వ్యాయామం చేస్తానని, ఎల్లుప్పుడు సంతోషంగా ఉంటానని, ఏ పని అయినా ఎంజాయ్ చేస్తానని చంద్రబాబు తన ఆరోగ్య చిట్టాను విప్పారు.

Total Views: 818 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

పోరాడారు.. సాధించారు

జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించింది.