ఆ ముగ్గురు కోసం చంద్రబాబు, జగన్!

ఏపీ ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు గురి ఇప్పుడు రాజ్య సభ ఎన్నికలపై పడింది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార విపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం బలాబలాల ప్రకారం టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు, వైసీపీకి 1 స్థానం దక్కాలి. కానీ వైసిపి ఆ ఒక్కటి దక్కుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి ప్రతిపక్షానికి ఆ ఒక్కటి కూడా దక్కకుండా చేయాలనీ చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.

ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పేసుకున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యే లు జంప్ అయితే ఆ ఒక్క సీటు దక్కించుకునే బలాన్ని కూడా వైసిపి కోల్పోతుంది. కర్నూలు, నెల్లూరు మరియు గుంటూరు జిల్లాల వైసిపి ఎమ్మెల్యేలపై చంద్రబాబు దృష్టి పెట్టారట. టీడీపీతో టచ్ లో ఉన్నవారికి మంత్రుల చేత రహస్య ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. వియజయసాయి రెడ్డి రూపంలో ఇప్పటికే ఓ రాజ్యసభ సభ్యుడు జగన్ కి ఉన్నారు. విజయ సాయి రెడ్డి తన పలుకుపడిని ఉపయోగించి టీడీపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. దీనితో ఇకొన్న రాజ్యసభ స్థానం కూడా వైసీపీకి దక్కకూడదని చంద్రబాబు తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాబు రాజకీయ ఎత్తుగడని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి..!

Total Views: 162 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..