పట్ట పగలు కరీంనగర్‌లో దారుణం!

కరీంనగర్‌లో పట్ట పగలు చైన్‌ స్నాచర్‌ రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో బంగారాన్ని తెంచుకెళ్లాడు. విద్యారణ్యపురిలో ఓ మహిళ తన ఇంటికి వెళుతోంది. అయితే ఓ కేటుగాడు ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. చుట్టు పక్కల ఎవరూ లేని సమయాన్ని చూసి చైన్‌ను లాక్కొని పరారయ్యాడు. బాధిత మహిళ కేకలు వేసినా చుట్టుపక్కల వాళ్లు వచ్చేటప్పటికే దొంగ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ సీన్‌ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… సీసీ ఫుటేజ్‌ ద్వారా స్నాచర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు.

ఇప్పటి వరకూ బైక్‌లపై వచ్చి చైన్‌లు తెంచుకు వెళ్లిన వాళ్లనే చూశాం. కానీ ఇప్పుడు కరీంనగర్‌లో ఉదయాన్నే వాకింగ్‌కి వచ్చినట్టు వచ్చిన ఓ దొంగ, చైన్ లాక్కుని పారిపోవడం సంచనలమైంది. ఈ దొంగకు తోడుగా మరొక వ్యక్తి కూడా వచ్చి ఉండొచ్చని చెప్తున్నారు. ఎవరైనా చోరీ చేసినట్టు గుర్తించినా, బైక్ నంబర్ దొరక్కుండా ఇలా స్నాచింగ్‌కి ప్లాన్ చేసి ఉంటారని చెప్తున్నారు. ఈ కాలనీలో మాటు వేసి పక్కా ప్లాన్‌తోనే చోరీకి పాల్పడ్డారంటున్నారు.

Total Views: 550 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రాజేష్‌ని కాపాడుతున్న హాస్పిటల్ బిల్!

క్రైం స్టోరీని తలపించే సుధాకర్ రెడ్డి హత్యోదంతం.. బెడ్‌పైన ఉన్న