‘కమ్మ’నైన నందులు !

వరుసగా మూడేళ్లకు సంబంధించిన నంది అవార్డులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లకు సంబంధించిన విజేతలను అధికారికంగా ప్రకటించింది. త్వరలో నందుల పంపిణీ కూడా జరగబోతోంది. కానీ తాజాగా ప్రకటించిన నందీ అవార్డుల ఎంపికను గమనిస్తే ఫలువురికి ఆశ్చర్యం కలుగుతుంది. అవార్డులకు కొలబద్ద ఏమిటనే సందేహం కలుగుతుంది. అవార్డుల జ్యూరీ కమిటీ నిర్ణయాలకు కొలమానం మీద అనుమానం వస్తుంది.ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాటలను కూడా ఓ మారు గుర్తు చేసుకోవాల్సి ఉంది. పదవి , పలుకుబడి పైరవీలు ఉంటే నందులు ఇంటికి నడిచి వస్తాయి అని చెప్పిన మాటలలొ అంతరార్ధం గ్రహించి నంది అవార్డుల ఎంపికను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నంది అవార్డులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కుల వర్గానికే కాపు కాసి మిగతా కులాల వారికీ అన్యాయం చేశారనే టాక్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇక్కడ లెజెండ్ కి 2014 కు గాను అనేక అవార్డులు వరించింది. అందులో వింతేమీ లేదు. కానీ 2015 కి వచ్చేసరికి శ్రీమంతుడు కి బాహుబలి గట్టి పోటీ ఏర్పడింది. బాహుబలి అన్ని కేటగిరీలలో నందులను ఎగరేసుకుపోగా… ఒక్క ఉత్తమ నటుడు అవార్డుని మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. ఆ ఉత్తమనటుడు అవార్డుని మహేష్ శ్రీమంతుడికి ఇచ్చారు. మరి ప్రభాస్ బాహుబలిగా ఎలాంటి పెరఫార్మెన్సు చూయించాడో అనే విషయం యావత్ భారతానికి తెలుసు. మహేష్ కూడా శ్రీమంతుడులో అద్భుతమైన నటన కనబరిచ్చాడు. కానీ ప్రభాస్ కి బెస్ట్ హీరో అవార్డు రాకపోవడంపై అభిమానుల్లో అసంతృప్తి కనబడుతుంది.

ఇక 2016 లో ఉత్తమ చిత్రంగా పెళ్ళి చూపులుకిచ్చి… ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కి అవార్డు ప్రకటించారు. మరి 2014 , 2016 అవార్డుల విషయంలో కాస్త నెమ్మదిగా వున్న అభిమాన గణం 2015 విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నంది అవార్డుల ఎంపికలో కుల రాజకీయాలు చేశారనే మాట మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ నంది అవార్డుల వెనుక బాలకృష్ణ హ్యాండ్ గట్టిగా ఉందంటున్నారు కూడా.

నందమూరి, బోయపాటి, రాఘవేంద్రరావు, రాజమౌళి.. ఇలా అమరావతి నందుల సందడిలో ‘పసుపుదనం’ ఎక్కువైందన్న చమక్కులు నిన్నే పడ్డాయి. అధికార పార్టీ తెలుగుదేశానికి, సీఎం చంద్రబాబుకు దగ్గరగా మెలిగే పర్సనాలిటీలకు మాత్రమే ప్రయారిటీలు దక్కినట్లు ఎవరికివారు విశ్లేషించుకుంటున్నారు. అయితే.. ఈ వేడి కొద్దికొద్దిగా రాజుకుంటోంది. మెగా ఫ్యామిలీ హీరోలకూ సన్నిహితంగా వుండే బన్నీ వాస్ అనే కో-ప్రొడ్యూసర్ అవార్డుల ఎంపిక మీద సీరియస్ కామెంట్ చేశారు. ”నంది అవార్డులు కావాలనుకునే మెగా హీరోలు.. ఏపీ సర్కార్ దగ్గర నటన నేర్చుకోవాలి..” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. అభిమానుల్లో నివురుగప్పిన నిప్పులా వున్న నిరసన.. బన్నీ వాస్ కామెంట్ తో మరింత రాజుకున్నట్లయింది.

అక్కినేని ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో సానుభూతి వ్యాఖ్యలు కనిపించాయి. మూడు తరాల కథానాయకులతో, వినూత్న కథనంతో ప్రయోగాత్మకంగా తీసిన ‘మనం’ మూవీ కేవలం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలవడం.. నాగ్ కి ఇబ్బంది కలిగించే అంశమే! ఇక.. మెగా క్యాంప్ లో కూడా ఒకింత నిరాశావాతావరణమే! చిరంజీవికి దక్కిన రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం తప్పితే.. మెగా ఫ్యామిలీలో మరే హీరోకూ సరైన న్యాయం జరగలేదంటూ నిట్టూర్పులు వినిపించాయి. రుద్రమదేవి మూవీలో ‘బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా మెరిసిన అల్లు అర్జున్ తప్పితే మరెక్కడా ‘మెగా’వాసన లేనేలేదు.

ఓవరాల్ గా నందీ అవార్డుల జాబితా ను పై నుంచి కిందికి, కింది నుంచి పైకి.. ఇలా ఎలా చూసినా కమ్మ వాళ్ల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి, కమ్మ వాళ్లు తీసిన సినిమాలే అవార్డులు పొందాయి. ఒక్క హీరోయిన్ల విభాగం మాత్రమే మిస్ అయ్యింది. కమ్మ వాళ్ల ఆధిపత్యాన్ని తట్టుకుని ఈ జాబితా లో నిలిచిన సినిమాల పెళ్లి చూపులు, శతమానంభవతి మాత్రమే అని సోషల్ మీడియా కోడైకూస్తోంది.

మొత్తంగా సోషల్ మీడియాలో, సినీ అభిమానుల్లో జరుగుతున్నా చర్చ ఏంటంటే.. అవార్డుల ఎంపికలో పసుపు హావ సాగినట్లు చర్చించుకుంటున్నారు. నందమూరి, బోయపాటి, రాజమౌళి ఇలా చంద్రబాబు సన్నిహితులకు పెద్ద పీట వేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Total Views: 580 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే