ఉత్కంఠ భరితంగా కన్నడ ‘రంగస్థలం’

రాజకీయ డ్రామాకు వేదికగా నిలిచింది కర్ణాటక.ఊహించని మలుపులు.. ఎడతెగని ఉత్కంఠతో సాగుతున్నాయి కన్నడ రాజకీయ సిత్రాలు.కర్ణాటక రాజకీయాలు నాటకీయ పరిణామాలకు వేదికగా మారింది. కాంగ్రెస్ శాసససభాపక్ష సమావేశానికి ముందు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో ఉత్కంఠ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు అందుబాటులో లేకుండాపోయారు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కూడ్లగి ఎమ్మెల్యే నాగేంద్ర, అమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్యేలు భీమా నాయక్, అమెర్ గౌడ నాయక్ లు కనిపించకుండా పోవడంతో అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు జేడీఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజా వెంకటప్ప నాయక్, వెంకటరావు నడగౌడలు కనిపించకుండాపోయారు. బెంగళూరులోని ఓ హోటల్లో జేడీఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగుతోంది. ఇద్దరు అదృశ్యం కావడంతో జేడీఎస్ లో ఆందోళన మరింత పెరిగిపోయింది. అటు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇస్తారన్న ఆశతో ఇరు వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

Total Views: 39 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

యెడ్డీ అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో?

దేశ రాజకీయ ముఖ చిత్రం పై యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు