బడ్జెట్ లో తగ్గేవి పెరిగేవి ఇవే!

బడ్జెట్‌ అనగానే సామాన్య పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న ఒకటే.. ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయ్‌.. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయ్‌? అని. అయితే ప్రస్తుతం వస్తువులపై జీఎస్‌టీ అమలవుతోంది. దీంతో గతంతో పోలిస్తే ఈ సారి వస్తువుల ధరలపై బడ్జెట్‌ ప్రభావం తక్కువగానే ఉన్నట్లు కన్పిస్తోంది. అయితే ‘మేకిన్‌ ఇండియా’కు ప్రాధాన్యమిచ్చిన కేంద్రం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచింది. మరి కొన్నింటిపై తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. మరి ఆ వస్తువులేంటో ఓసారి చూద్దాం.

ధరలు పెరిగే వస్తువులివే..

* ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, కార్లు, మోటార్‌బైక్‌లు, టీవీలు, స్మార్ట్‌ వాచీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ పరికరాలు తదితరాలు.

* ట్రక్కు, బస్సు రేడియల్‌ టైర్లు, మొబైల్‌ ఫోన్‌ విడి భాగాలు, ల్యాంప్‌లు, లైటెనింగ్‌ ఫిట్టింగ్‌, ఇల్యుమినేటెడ్‌ సైన్స్‌.

* స్టాప్‌ వాచీలు, పాకెట్‌ వాచీలు, చేతి గడియారాలు, అలారం గడియారాలు.

* బంగారం, వెండి, ఇమిటేషన్‌ జ్యుయలరీ, రంగు రంగుల రాళ్లు, వజ్రాలు.

* చెప్పులు, సిల్క్‌ వస్త్రాలు, టూత్‌పేస్టులు.

* దిగుమతి చేసుకునే కూరగాయలు, పండ్ల రసాలు, రిఫైన్డ్‌ వెజిటబుల్‌ ఆయిల్‌, వేరుశెనగ నూనె, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, సఫోలా నూనె

* ఫర్నీచర్‌, పరుపులు, మంచాలు

* మేనిక్యూర్‌, పెడిక్యూర్‌ ప్రిపరేషన్స్‌, బ్యూటీ, మేకప్‌ ఉత్పత్తులు, ఫర్‌ఫ్యూమ్‌లు, డియోడరంట్లు, సెంట్ స్ప్రేలు, సన్‌స్క్రీన్‌, సన్‌ట్యాన్‌

* షేవింగ్‌ ఉత్పత్తులు

* టాయిలెట్‌ స్ప్రే, టాయిలెట్‌ వాటర్స్‌

* పాన్‌ మసాలా, బీడీ, సిగరెట్‌ లైటర్లు, క్యాండిల్స్‌

* గాలిపటాలు, సన్‌గ్లాసెస్‌

* వీడియో గేమ్స్‌, పిల్లలు ఆడుకునే చక్రాల బొమ్మలు, ఫజిల్‌ గేమ్‌లు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్‌ కార్స్‌, తదితర బొమ్మలు

* క్రీడా వస్తువులు

ధరలు తగ్గే వస్తువులివే..

* ముడి జీడిపప్పు

* పెట్రోల్‌, డీజిల్‌

* సోలార్‌ టాంపర్డ్‌ గ్లాస్‌, సోలార్‌ ప్యానెళ్లలో ఉపయోగించే టాంపర్డ్‌ గ్లాస్‌

* బాల్‌ స్క్రూలు, సీఎన్‌జీ మెషిన్‌ టూల్స్‌

* వినికిడి పరికరాల తయారీకి అవసరమయ్యే ముడి వస్తువులు

Total Views: 1097 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే