విజయనగరంలో ఉద్రిక్తత

సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల ఓటర్లను తొలగించేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. బయట వ్యక్తులు ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నెల్లిమర్లలో సర్వేల పేరుతో  తిరుగుతున్న వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదని, ఆ వ్యక్తులను తమ కార్యకర్తలే పట్టుకుని పోలీసులకు అప్పగించారని బొత్స చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తులను వదిలేసి, ట్యాబులను తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకోమని స్థానిక పోలీసులే అప్పజెప్పారని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. నెల్లిమర్లలో తమ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదన్న వైసీపీ అగ్రనేత, సేవ్ డెమోక్రసీ అంటే ఇదేనా..? నిలదీశారు.

Total Views: 129 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే