వీర్రాజు నిగ్గుతేల్చిన నిజాలు!

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని అనలేదా? అని ప్రశ్నించారు. ఈ ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, హోదా వస్తే రూ. 3 వేల కోట్ల మేరకు మాత్రమే లబ్ది కలుగుతుందని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేస్తూ, అప్పట్లో హోదా ఉన్న రాష్ట్రాలకన్నా ఏపీకే ఎక్కువ వచ్చాయని కూడా చంద్రబాబు అన్నారని, ఇప్పుడు తాను అవే మాటలు చెబుతుంటే విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు. ఎందుకు మాట మారుస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించలేని తెలుగుదేశం నేతలు, ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ సకాలంలోనే వచ్చాయని, వస్తున్నాయని ఇప్పుడు కావాలనే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నాడు.

ఓ వైపు సమన్యాయం, మరోవైపు సమైక్యవాదం అంటూ చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం ఆయనేనని వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.నాడు విభజనకు తాను అనుకూలమేనని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చూపించి పలు విమర్శలు గుప్పించారు. అప్పట్లో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారే తప్ప, ఏపీలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. వెంకయ్యనాయుడుగారు ఆరోజు ఐదేళ్లు, పదేళ్లు కాదు… పదిహేనేళ్లు కావాలని అడిగారు. ఆయన అడిగిన తరువాతే వీళ్లంతా వచ్చారు. హోదాకు బదులు ప్యాకేజీ మూడు వేల కోట్లు చాలన్నారు. ఇప్పుడీ విధంగా ఎందుకు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఐదేళ్లని పెట్టారని గుర్తు చేస్తూ, నాడు ఐదేళ్ల స్థానంలో పదిహేనేళ్లని పెట్టించేందుకు టీడీపీ ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదని దుయ్యబట్టారు.

Total Views: 458 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ