లెక్కలు చెప్పిన బీజేపీ! మరి టీడీపీ ?

బీజేపీ ఏమీ చేయలేదు.. ఏ నిధులు కేటాయించటం లేదంటూ పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ హైకమాండ్. ఏపీకి విడుదల చేసిన నిధుల చిట్టాను బయట పెట్టింది. వీటికి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి లెక్కలు రాలేదని.. అందుకే మిగతా నిధులు సిద్ధంగా ఉన్నా విడుదల చేయటం లేదంటూ జాతీయ మీడియాకి 26 పేజీల నోట్ రిలీజ్ చేసింది. జాతీయ స్థాయిలో మోడీపై.. చంద్రబాబు యుద్ధం అంటూ కథనాలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోనే ఈ నోట్ రిలీజ్ చేశారు బీజేపీ నేతలు.
ఏపీకి కేటాయింపులపై బీజేపీ విడుదల చేసిన చిట్టా :
– రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ,2,500 కోట్లు ఇచ్చాం (వీటికి లెక్కలు చెప్పటం లేదనేది బీజేపీ ఆరోపణ)
– పోలవరం నిర్మాణానికి రూ.4,662 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్ట్‌ పూర్తి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది.
– చట్టంలో పదేళ్ళ కాలపరిమితిలోగా ఇవన్నీ చేయాలని ఉంది. మోడీ సర్కారు మాత్రం మూడేళ్లలోనే చేసింది.
– 85 శాతం హామీలు మూడున్నరేళ్లలో అమలు చేశాం.
– విభజన చట్టం ప్రకారం కేవలం 5 సంస్థలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి
– కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం
– దుగరాజపట్నం పోర్టుకు రక్షణ శాఖ, ఇస్రో నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి
– రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం సూచిస్తే, అక్కడ వెంటనే పోర్టు నిర్మాణం చేపడతాం. ఇప్పటి వరకు స్పందించలేదు.
– రైల్వే జోన్ అంశం కూడా త్వరలో ప్రకటన ఉంటుంది. ఏర్పాటు జరుగుతుంది
– రూ.లక్ష కోట్ల విలువ చేసే జాతీయ రహదారులు మంజూరు చేశాం
– షిప్పింగ్ మరియు వాటర్ వేస్ లో… చట్టంలో లేని ప్రాజెక్ట్ మంజూరు చేసాం
– పెట్రోలియం కాంప్లెక్స్ పని కూడా జరుగుతుంది
– తిరుపతి ఐఐటీకి రూ.90.93 కోట్లు కేంద్రం ఇచ్చింది

Total Views: 181 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

పవన్ కు మద్దతుగా ఉండవల్లి కామెంట్స్

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఒత్తిడి పెరుగుతుందని పవన్ కల్యాణ్