చంద్రబాబుకు పురందేశ్వరి సూటి ప్రశ్న

ఏపీకి కేంద్రం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి అన్నారు. ఓ పథకం ప్రకారం తప్పును బీజేపీవైపు నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం అలక్ష్యం చేయబోదన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి పెద్దగా లాభం ఉండదనే జైట్లీ చెప్పారన్నారు. ఈశాన్య రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా కొనసాగించలేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర విద్యాసంస్థలకు తక్కువ నిధులిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురంద్రీశ్వరి అభిప్రాయపడ్డారు. కేంద్రం చొరవ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెరిగాయన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్లు ఇచ్చిందన్నారు. రెవెన్యూ లోటు పూడ్చటానికి కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాలకు ఇప్పటికే పన్ను రాయితీలు ఇచ్చారని ఆమె తెలిపారు.

పదేళ్లపాటు హైదరాబాద్ లోనే ఉంటూ అన్నీ చక్కదిద్దుకునే అవకాశాన్ని వదిలేశారని గుర్తు చేసిన ఆమె, అయినప్పటికీ ఏపీకి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి లాభం ఉండదని చంద్రబాబునాయుడు స్వయంగా అంగీకరించారని, ప్యాకేజీలో భాగంగా డబ్బు తీసుకుని ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని అడిగితే, ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు హోదా కోసం గొడవ చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు.

 

Total Views: 3345 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఉలిక్కి పడుతున్న తెలుగు తమ్ముళ్లు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారని