ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ రివ్యూ

టాలీవుడ్‌లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది.. సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్‌లుక్‌ అదరగొడుతోంది.. మనదేశం మూవీలో ఎన్టీఆర్‌ గెటప్‌ని గుర్తు చేస్తూ బాలయ్య అద్భుతంగా కనిపించారు.టాలీవుడ్‌ మోస్ట్‌ అవెయిటెడ్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్‌ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్రేజ్‌ క్రియేట్‌ చేసింది. మనదేశం ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ జిరాక్స్‌ కాపీని తలపిస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ క్రిష్ చేతికి వెళ్లిన త‌ర‌వాత‌ మరింత స్పీడందుకుంది. గౌతమీపుత్ర శాతకర్ణితో బాలయ్యకు బంపర్‌ హిట్‌ అందించిన క్రిష్ ఈ చిత్రంలో ఆయన రూపు రేఖ‌లపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు.మనదేశం సినిమాతో సీనియర్‌ ఎన్టీఆర్‌ తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ గెట‌ప్‌ని గుర్తు చేస్తూ స‌రిగ్గా అదే పోలీస్‌ వేష‌ధార‌ణ‌లో ఉన్న బాల‌య్యని చూపించారు. ఎన్టీఆర్ సినీ చ‌రిత్ర రాయాల్సివ‌స్తే అందులో కచ్చితంగా మనదేశం మొదటి అధ్యాయంగా నిలుస్తుంది. అందుకే దాన్ని ఫ‌స్ట్ లుక్ పేరుతో గుర్తు చేసి నంద‌మూరి అభిమానుల్ని ఆకట్టుకునేలా చేశారు క్రిష్‌. బాల‌య్య రూపం పూర్తిగా చూపించ‌కుండా సైడ్ లుక్‌తో స‌రిపెట్టారు. అలాగే 1975 లో విడుదలైన సావనీర్‌లో ఎన్టీఆర్ అభిమానుల‌ను ఉద్దేశించి తన స్వదస్తూరితో రాసిన మాట‌ల్ని గుర్తు చేసే ప్రయ‌త్నం చేశారు క్రిష్‌. మొత్తంగా ఫస్ట్‌ లుక్‌తోనే ఎన్టీఆర్‌ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక వైఎస్‌ఆర్‌ బయోపిక్‌ టీజర్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.. వైఎస్‌ జయంతి సందర్భంగా ఈనెల 8న టీజర్‌ని రిలీజ్‌ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.

Total Views: 392 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు