‘జైసింహా’ రివ్యూ & రేటింగ్

సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ తో పాటు బాలయ్యకు లక్కీ సెంటిమెంట్స్ అయిన టైటిల్ లో సింహా, హీరోయిన్ గా నయనతారలను కూడా రిపీట్ చేసిన ఈ సినిమా మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందా..? స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కేయస్ రవికుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ :
నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర‍్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్‌ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. (సాక్షి రివ్యూస్‌)కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా మలిచాడు.ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశిం‍చే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అక్కడక్కడ కథనం నెమ్మదించి విసిగిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. అయితే `చంద్ర‌ముఖి`లో వ‌డివేలుకు ఉన్న అనుమానాన్ని ఇక్క‌డ బ్ర‌హ్మానందానికి పెట్టారు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` చిత్రంలో అంజ‌లికి ఉన్న కంగారును ఇందులో హ‌రిప్రియ పాత్ర‌కు పెట్టారు. ప్రేమించింది ఒక‌రిని, పెళ్లి చేసుకుంది మ‌రొక‌రిని అన్న‌ప్పుడు `క్ష‌త్రియ‌పుత్రుడు`తో స‌హా ప‌లు సినిమాలు గుర్తొస్తాయి. అయితే అవ‌న్నీ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎలా ఉంద‌ని ఆలోచించ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాతే. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడు లీన‌మ‌వుతాడ‌న్న‌ది నిజం. రోడ్డు రోకోల‌ను గురించి చెప్పే స‌న్నివేశం, పూజారుల అర్హ‌త‌ల‌ను, వారి ప‌విత్ర‌త‌ను వివ‌రించే సీనూ మెప్పిస్తాయి. `సింహా` సినిమా బాల‌కృష్ణ‌కు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తాజాగా అదే పేరుతో ఆయ‌న జై సింహా అని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అలా ఇది బాలకృష్ణకు ఒక కొత్తరకం సినిమా అనే చెప్పాలి. ఒక ప్రేమికుడి త్యాగంగా ‘జైసింహా’ను అభివర్ణించవచ్చు. వినోదం విషయంలో మరిన్ని కసరత్తులు తీసుకుని ఉంటే బాగుండేది.

రేటింగ్ 2.5

Total Views: 6209 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు