మా ఇంట్లో గోడలుంటాయి, గొడవలుంటాయి!!

Satakarniఒకేసారి వంద థియేటర్లలో గౌతమీపుత్ర శాతకర్ణి పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఇది పతాక ఆవిష్కరణ మాత్రమే కాదని రాబోయే విజయానికి నాంది అన్నారు. చిత్ర హీరో బాలకృష్ణ పాల్గొని స్థానిక జ్యోతి థియటర్లో శాతకర్ణి పతాకాన్ని ఆవిష్కరించారు. చిత్రంలోని పలు డైలాగ్‌లను చెప్పి అభిమానుల్ని అలరించారు. ‘ఇక్కడ మా ఇంట్లో గదికి గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటే మా ఇల్లని కొట్టుకుంటాం. కానీ మధ్యలో ఇంకొకడొచ్చి వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం, మొండాల మీద మా జెండాని ఎగరేస్తాం’ అంటూ ఆవేశంగా డైలాగ్ చెప్పారు.దీంతో అభిమానులంతా అరుపులతో ప్రాంగణమంతా దద్దరిల్లేలా చేశారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన డైలాగులు మీరు సినిమాలో చూస్తారని చెప్పారు. సమయం లేదు మిత్రమా 12న చిత్రం విడుదల కాబోతుందని చెబుతూ బాలయ్య బాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Total Views: 286 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఫాన్స్ కి పండగ..చిరుతో పవన్ భేటీ

ఖైదీ నెంబర్‌ 150’ ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాలేకపోయిన పవర్‌స్టార్ పవన్