బాహుబలి 2 రివ్యూ & రేటింగ్

ఏడాదిన్నరగా యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమాధానం బయటికి వచ్చింది. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్‌ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. ఐదేళ్ల రాజమౌళి, ప్రభాస్‌ల కృషి ఎంతవరకూ ఫలించింది? ‘బాహుబలి: ది బిగినింగ్‌’ మిగిల్చిన సందేహాలకు సమాధానాలు లభించాయా? తొలి భాగాన్ని మించే విజయం సాధిస్తుందా..? ఆ అంచనాలను అందుకుందా..? అన్నవి తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.
 
కథ :
అమరేంద్ర బాహుబలి(ప్రభాస్‌)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గర కావాలని మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి ఓ అమాయకుడిలా నటిస్తాడు. కుంతల రాజ్యానికి ఆకస్మికంగా వచ్చిపడిన ఓ పెను ప్రమాదం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడతాడు. ఈలోగా దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవుడు(రానా) ఆమెపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. అప్పుడేం జరిగింది? రాజ్యాన్ని విడిచి బాహుబలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పెంచిన చేతులతోనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తన తండ్రి మరణానికి కారణమైన భళ్లాలదేవుడిపై మహేంద్ర బాహుబలి(ప్రభాస్‌) ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే మిగిలిన కథ.
 
నటీనటులు :
ఈ సినిమా తెర మీదకు రావటంలో ప్రధాన పాత్ర హీరో ప్రభాస్దే. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం ప్రభాస్ పడిన కష్టం చూపించిన డెడికేషన్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.ఇక ప్రభాస్ కు ధీటైన పాత్రలో రానా ఆకట్టుకున్నాడు. తన వయసుకు అనుభవానికి మించిన పాత్రను తలకెత్తుకున్న రానా.. మరోసారి విలక్షణ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ తో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. తొలి భాగాంతంలో కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. బాహుబలి ప్రియురాలిగా అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది. తమన్నా పాత్ర క్లైమాక్స్ కే పరిమతమైంది. రెండో భాగంలోనే కనిపించిన సుబ్బరాజు కుమార వర్మగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండించాడు. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
 
 సాంకేతిక నిపుణులు :
సాంకేతికంగా కీరవాణి సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.  భళి భళిరా సాంగ్‌, దండాలయ్యా సాంగ్స్‌ సహా అన్నీ సాంగ్స్‌ బావున్నాయి. అలాగే సన్నివేశాల మధ్య బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గాఢతను పెంచాడు.అయితే పాటల విషయంలో మాత్రం తొలిభాగానికి వచ్చినంత రెస్పాస్స్ బాహుబలి 2 పాటలకు రాలేదు. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ ది బెస్ట్‌. ఇక కమల్‌ కణ్ణన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో నిలిపింది. ఒక ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి తొలి భాగంలో వినిపించిన విమర్శలన్నింటికీ సీక్వల్ తో సమాధానమిచ్చాడు. బాహుబలి 1స్థాయికి మించి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ సన్నివేశాలు..ఆ సీన్స్‌ చూస్తుంటే తెలుగు సినిమా స్టాండర్డ్‌ను హాలీవుడ్‌ రేంజ్‌లో చేసినందుకు అభినందిచాల్సినిపించింది. సాబుశిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ ఇలా అన్నీ సినిమాను మరో రేంజ్‌లోనిలిపాయి. సినిమా లెంగ్త్‌ ఎక్కువ కావడం మినహా ఆకట్టుకునే విజువల్‌ వండర్‌. 
 
రేటింగ్ 4.0
(Satish K.S.R.K)
 

Finally, the most awaited film is here. And, it not only not disappointed the countless eager fans, but it also showed that this magnum opus is bigger, better and far beyond expectations.

There are more emotions, more drama, more intense display of histrionics and more magical camera moments and out-of-the-world graphic work. Bahubali 1 was only the beginning and Bahubali 2 is the crescendo, the pinnacle. Everything about the film is superlative.

Story:
Baahubali:The Conclusion starts from where Baahubali:The Beginning ended. As shown in the first part, Baahubali (Prabhas) declared as a king of Mahishmati and Bhalladeva( Rana) as supreme Commander. As a part of the Kingdom’s ancestral ritual, the would-be king needs to visit the countryside to know what problems the people in the kingdom are facing. Baahubali visits to a small kingdom Kuntala and gets attracted to Princess Devasena (Anushka). He brings her to Mahishmati. After coming back to his palace, he was shocked after hearing the changed decision of Shivagami (Ramya Krishna) as she announced Bhallaladeva as the king of Mahishmati kingdom. Why did Shivagami suddenly change her decision? Why did Kattappa kill Baahubali? To know these answers, one should watch the movie on silver screen.

Performances:
Prabhas who looked jaded and subdued in the first part is in his elements in this one. His voice and demeanor suited the role of a king. While he is extremely good as Amarendra Baahubali, he did an okay job as Mahendra Baahubali. Rana is pretty impressive as Ballala Deva who is jealous of Baahubali’s charm and popularity. He is like a raging bull in the climax fight. Anushka takes the cake with a wonderful performance. It is easily the best performance in her career so far. Ramya Krishna is superb as the mother caught between two brothers. Satya Raj enlivened his character and Nasser is excellent as Bijjala Deva.

Technical
Rajamouli and his team weave magic on screen and all every department compliments the other. Rajamouli recreates a visual wonder of unforeseen magnitude and leaves the viewer wonder struck. In every frame, there is a surprise. Graphics, visual effects, war drama and emotions leave literally no scope for complaining. Senthil’s cinematography and art work by Saboo Cyril add to the beauty of the films. The VFX department needs to be patted in the back for its wonderful work. Keeravani’s BGM lifts up the film to unattainable heights. Deft editing by K V Rao makes the film racy and pacy. Without doubt, this film will go down in the history as the most towering of all films.

Rating : 4.0

Total Views: 5941 ,

1 Comment

  1. This is just a madness in Indian audience, and these filmy Guys are en-cashing on that. There is no connect between frame-2-frame. And the script is too modern to use for a film like this. There is no comedy, romance, or drama elements in any frame. I couldn’t find any song with proper music. I am not sure why people are spending 400-500 Rs per ticket, which is of no value.

    I advice people should explore more entertainment options, rather spending on dummy movies like this. Simplest option is go and stay in a resort for a day or two, you get much better entertainment/relaxation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..