అశ్రునయనాల మధ్య దివికేగిన వాజ్‌పేయి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు.

అంతిమ యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. వాజ్‌పేయి పట్ల అమితమైన గౌరవభావం కలిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఎల్‌కే అద్వానీ, మధ్య ప్రదేశ్ సీఎం, మహారాష్ట్ర సీఎం సహా బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి పార్థివదేహం వెంట నడుస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.వాజ్‌పేయి అంతిమ యాత్రలో ఆయన్ను కడసారి చూసేందుకు భారీసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగింది. దారి పొడవునా అటల్ జీ అమర్‌రహే నినాదాలు వినిపించాయి.కేవలం బీజేపీ అభిమానులు మాత్రమే కాదు అటల్ వ్యక్తిత్వాన్ని అభిమానించే ఎంతోమంది ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

వాజ్‌పేయి మృతికి సంతాపంగా 15 రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించగా.. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఏపీలోనూ 7 రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోనున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

Total Views: 412 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ