అటల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి కొన్ని విషయాలు!

రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.

1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు.

కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి..
కశ్మీర్‌లో శాంతి స్థాపనకు విశేష కృషిచేశారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌కు దీటైన సమాధానమిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధానిగా హిందీలో ప్రసంగించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించిన వాజ్‌పేయి.. తొలిసారి అమెరికా అధ్యక్షుడికి ఆహ్వానం పంపారు. ఆహ్వానం మేరకు 2000లో క్లింటన్ భారత్‌కు వచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రదాడిని బీజేపీ సర్కార్ బలంగా తిప్పికొట్టింది. గుజరాత్ అల్లర్లపై మోదీకి ఉద్బోద చేసిన ఆయన రాజధర్మాన్ని గుర్తు చేశారు.

Total Views: 370 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ