‘అరవింద సమేత వీర రాఘవ‌’ మూవీ రివ్యూ

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలు అరవింద సమేత అందుకుందా..? ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడా..? త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాత ఫామ్‌ను అందుకున్నాడా?

కథ ;
వీర‌రాఘ‌వ (ఎన్టీఆర్‌) ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో తండ్రి(నాగ‌బాబు)ని కోల్పోతాడు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు ‘హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. ఒక‌సారి అర‌వింద‌పై అటాక్ జ‌రుగుతుంది. ఆ ప్ర‌మాదం నుంచి అర‌వింద‌ను ర‌క్షిస్తాడు వీర రాఘ‌వ‌. అప్ప‌టి నుంచి అర‌వింద‌కు సంర‌క్ష‌కుడిగా మార‌తాడు. అనుకోని ప‌రిస్థితుల్లో అర‌వింద ఇంటికి వెళ్లిన వీర రాఘ‌వకు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ఆమె నేప‌థ్యం ఏంటి? నాయ‌న‌మ్మ చెప్పిన‌ మాట‌ను నిలబెట్టుకుంటూ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని వీర రాఘ‌వ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే కథ.
నటీనటులు ;
ఎన్టీఆర్‌ సినిమా అంటేనే వన్‌ మెన్‌ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్‌పరంగానూ ఎన్టీఆర్‌ పడిన కష్టం సినిమాకు ప్లస్‌ అయ్యింది. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్‌ పాత్రలో జగపతి బాబు జీవించాడు. లుక్స్‌ పరంగానూ భయపెట్టాడు. యంగ్ హీరో నవీన చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ తనదైన టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికం :
త‌మ‌న్ అందించిన సంగీతం బాగుంది. రం.. రుధిరం.., పెనివిటి పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ విష‌యంలో త‌మ‌న్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్న‌త స్థాయిలో ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం. ఎన్టీఆర్‌ను చూపించిన తీరు, యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. సినిమా నిడివి కాస్త ఎక్కువ‌గా అనిపిస్తుంది. ఎడిట‌ర్ న‌వీన్ నూలి త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెడితే బాగుండేది. త్రివిక్ర‌మ్ త‌న శైలికి భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని, దానికి త‌న‌దైన భావోద్వేగాల‌తో కూడిన మాట‌ల‌ను అందించ‌డం ఈ చిత్రానికి మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.

Total Views: 1058 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు