ప్రమాదం జరిగి కాళ్ళు పోయిన 33మందిని కాపాడిన డ్రైవర్!

ప్రమాదంలో కాళ్లు విరిగిపోయినా ధైర్యం కోల్పోకుండా 33 మందిని  రక్షించాడు ఈ డ్రైవర్ అన్న.. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద జరిగింది. ఏపీఎస్‌ ఆర్టీసీ ఆటోనగర్‌ డిపో గరుడ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తోంది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో రోడ్డు దాటే క్రమంలో ఉన్నట్టుండి రహదారి మధ్యలోకి దూసుకొచ్చిన ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కుడి భాగం నుజ్జయింది. డ్రైవర్ ఎన్‌.ఎ.శేషు రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆ పరిస్థితిలోనూ ఆయన ధైర్యం సడల లేదు. నియంత్రణా కోల్పోలేదు. బస్సును జాతీయ రహదారి నుంచి దించి సుమారు 70 మీటర్ల దూరంలోని చదునైన ప్రాంతంలో సురక్షితంగా నిలపడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.స్థానికులు గాయపడిన డ్రైవర్ ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శేషును విజయవాడకు తరలించారు.

Total Views: 109 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన ఖాకినే..లైంగిక వేధింపులు!

న్యాయాన్ని రక్షించాల్సిన ఖాకి నిస్సహాయ స్థితిలో ఉన్న అడపడుచును లైంగిక