పూనమ్‌కౌర్‌ అంశంపై ఏపీ మంత్రి కామెంట్!

సినీనటి పూనమ్‌కౌర్‌ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. దీనిపై పూనం సోదరుడు సైతం స్పందించి కత్తిమహేష్ పై కేసు పెడతామని కూడా చెప్పారు. కత్తి మహేష్ పూనం‌ని ఉద్దేశించి చేసిన విమర్శల్లో పవన్ కళ్యాణ్ ఆమెను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేయించారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదన్నారు. ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదని తేల్చి చెప్పారు. కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని.. అంతేకాని బ్రాండ్ అంబాసిడర్ అనే అంశంపై ప్రభుత్వం చర్చించనేలేదని ఆయన స్పష్టం చేశారు.

Total Views: 108 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..