ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ ఈమె!

పూనం మాలకొండయ్య .. పరిచయం అవసరం లేని వ్యక్తి. సిన్సియర్ అండ్ సీరియస్ అధికారిగా ఆవిడకు పేరు.నీతి నిజాయితీ ఆవిడ ఆలోచనలో ఉంటాయి. నియమ నిబద్ధత ఆవిడ ఆచరణలో ఉంటాయి.ఎవరు చెప్పినా నిబంధనల మేరకే నడుచునే వ్యక్తిగా పూనం మాలకొండయ్యకు మంచిపేరుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అనేక శాఖలకు అధికారిగా వ్యవహరించిన పూనం మాలకొండయ్య ఏడాదికి మించి ఏ శాఖలోనూ పనిచేయకపోవడం విశేషం. ఎన్నో పదోన్నతులు పొంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె చంద్రబాబుకు టార్గెట్ గా మారారు..!
 
ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొదటి ఆరోగ్యమంత్రిగా నియమితుడైన బాబు సన్నిహితుడు, బిజెపిలో గెలిచి టిడిపి మనిషిగా , బాబుకు ఆంతరంగికుడుగా బ్రతుకుతున్న కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసందే.ఇటీవల చాపరాయి సంఘటనలో కాని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకోవడానికి 60 లక్షలు చెల్లించిన విషయంపైనా చంద్రబాబు పూనం మాలకొండయ్య పైనే మంత్రివర్గ సమావేశంలో ఫైరయ్యారని కథనాలు వుతున్నాయి. మంత్రి కామినేని నిర్లక్షాన్ని పట్టించుకోకుండా అధికారులపైనే ముఖ్యమంత్రి విరుచుకుపడటాన్ని చూస్తే .. ఆడలేక మద్దెల దరువు అన్నట్టు ఉంది. అయితే  కామినేని తీసుకునే నిర్ణయాలు , అసమర్థత వల్ల పూనం మాలకొండయ్య వంటి నిజాయితీ అధికారులు టార్గెట్ అవుతున్నారు.
Total Views: 672 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి