నమ్మకద్రోహం చంద్రబాబు నైజం!

నమ్మిన వాళ్ళను మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజం అని ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణ  విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో  భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నమ్మిన వాళ్లను మోసం చేయడం చంద్రబాబు నైజమని మోదీకి చెప్పానని అన్నారు. చంద్రబాబుకు అందరి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఏ రాష్ట్రానికీ చేయనన్ని పనులు ఏపీకి చేశామని అన్నారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా ఏపీకి కేంద్రం సాయం మాత్రం ఆగలేదని, 2017 -18లో రూ.1.26 వేల కోట్లు ఏపీకి కేటాయించిందని  అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే ఏపీకి ఏమీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారని, రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్నచంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని మోదీ తనను అడిగారని కన్నా తెలిపారు. 

Total Views: 207 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి కన్నీళ్ళొచ్చాయి : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం