జగన్ గూటికి ఏపీ అగ్రనేత!

నిన్న మొన్నటి వ‌ర‌కు ఏపీలో బీజేపీపై ఈగైనా వాల‌నివ్వని నేత‌.గ‌తంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా ఉండి, వైఎస్ హ‌యాంలో మంత్రి ప‌ద‌విని సైతం అలంక‌రించిన ఈయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌య‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని గుర్తించి వెంట‌నే అప్పటి హ‌వాలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో మారిన రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న‌లో తీవ్ర క‌ల‌త నెల‌కొనేలా చేశాయి.దీంతో ఇప్పుడు బీజేపీకి రాం రాం చెప్పి.. ఏకంగా వైసీపీతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆయ‌నే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన కన్నా లక్ష్మీనారాయణ… ఐదోసారి గుంటూరు వెస్ట్‌కు మారి గెలిచారు.

ఇక కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో బ‌ల‌మైన లీడ‌ర్ల కోనం అన్వేషిస్తోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా క‌న్నాను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. అయితే క‌న్నా ఇప్పటికే త‌న‌కు గుంటూరు వెస్ట్ సీటుతో పాటు పెద‌కూర‌పాడు సీటు కూడా ఇవ్వాల‌ని ఓ కండీష‌న్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ నుంచి మాత్రం ఓ ఎమ్మెల్యే సీటుతో పాటు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప్రయారిటీ ఉంటుంద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Total Views: 124 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే